Tuesday, 6 December 2011

అందరూ దొంగలే ! : 4000 గజాల స్థలాన్ని 30 ఏళ్ల నామ మాత్రపు అద్దెతో లీజుకు : Chandra Babu - Chanakya of Corruption

Chandra Babu  -  Chanakya of Corruption

‘‘స్వచ్ఛంద సంస్థ పేరుతో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌ను 1997లో స్థాపించారు. దానికి ట్రస్టీగా చంద్రబాబు ఉన్నారు. తమ ట్రస్టుకు భూమి కావాలని ప్రభుత్వానికి చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆ దరఖాస్తును ఆమోదించుకున్నారు. అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో 4000 చదరపు గజాల స్థలాన్ని 30 ఏళ్ల కాలానికి నామ మాత్రపు అద్దెతో లీజుకు కేటాయించుకున్నారు. అయితే.. ఈ స్థలాన్ని ఎలాంటి రాజకీయ, వాణిజ్య కార్యకలాపాలకూ ఉపయోగించరాదన్న స్పష్టమైన నిబంధన ఉంది. 

కొన్ని వారాలకే ఈ భూమిని రాజకీయ కార్యకలాపాలకు అద్దెకు ఇవ్వటానికి అనుమతి ఇవ్వాలని ఎన్‌టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రభుత్వానికి చంద్రబాబు అర్జీ పెట్టుకున్నారు. అప్పుడప్పుడూ రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ.. ఆ భూమిని నిరంతరం రాజకీయ కార్యకలాపాలకే వాడుతున్నారు. తద్వారా స్వచ్ఛంద సంస్థ ప్రాధమిక లక్షణాన్నే పక్కనపెట్టేశారు.
 

ఆ తర్వాత రెండేళ్లకు ఈ స్థలంలో భారీ భవనాన్ని నిర్మించారు. హైటెక్ సిటీ ప్రాజెక్టు కాంట్రాక్టులో చంద్రబాబు చూపిన ఉదారతతో ప్రయోజనం దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ఈ భవనం మొత్తాన్నీ ఉచితంగా కట్టి ఇచ్చింది. ట్రస్టు ఆదాయం కేవలం రూ. 8 లక్షలు కాగా భవన నిర్మాణ వ్యయం రూ. కోట్లలో ఉండటం గమనార్హం.
 

1999లో భవన నిర్మాణం పూర్తయిన తర్వాత అది.. చంద్రబాబు రాజకీయ పార్టీ టీడీపీకి అధికారిక కేంద్ర కార్యాలయంగా మారింది. అప్పటి నుంచీ దానిని రాజకీయ కార్యకలాపాలకే వినియోగిస్తున్నారు. ఎన్‌టీఆర్ ట్రస్టుకు టీడీపీ అద్దె కూడా చెల్లిస్తుండటం విశేషం.
 

చంద్రబాబుకు చెందిన ట్రస్టు, పార్టీ ఒకే భవనం నుంచి పనిచేస్తుండటంతో.. ట్రస్టుకు భారీ మొత్తంలో విదేశీ నిధుల ప్రవాహం జరుగుతూ, ఆ నిధులను లెక్కల్లో చూపకుండా పార్టీకి తరలించి ఉపయోగించటం యథేచ్ఛగా సాగిపోతోంది. ఇది విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం రెండింటినీ ఉల్లంఘించినట్లే.
 

ట్రస్టుకు ఏటా రెండు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకూ విరాళాలు వస్తున్నాయి. దేశీయంగా వచ్చిన గణనీయమైన విరాళాల్లో సత్యం గ్రూప్ ఇచ్చిన రూ. కోటి, మధుకాన్ షుగర్స్, హయగ్రీవా ఎస్టేట్స్ ఇచ్చిన రూ. 20 లక్షలు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందిన సంస్థలే.
 

ఇక ఎన్‌టీఆర్ ట్రస్ట్‌కు జీవితకాల ట్రస్టీగా చంద్రబాబును మాత్రమే ప్రకటించారు. ఈ ట్రస్టుకు ఆయన రాజకీయ పార్టీ టీడీపీ నుంచి ఎవరూ వారసులు ఉండబోరు. ప్రస్తుతం ట్రస్టులో ఇతర సభ్యులుగా చంద్రబాబు భార్య, చంద్రబాబు ఆడిటర్‌లు మాత్రమే ఉన్నారు. అంటే ట్రస్టు మొత్తం బాబు గుత్తాధిపత్యంలోనే ఉండిపోయింది.’’
 

సర్కారు సంస్థలను అమ్మేసుకున్నారు

‘‘సంస్కరణల పేరుతో చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి వాటిని తన అనుయాయులకు కారుచౌకగా అమ్మేశారు. ఈ విక్రయాల్లో కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించారు. చంద్రబాబు హయాంలో 87 రాష్ట్ర స్థాయి ప్రభుత్వరంగ సంస్థల్లో ‘సంస్కరణలు’ చేపట్టాలని గుర్తించారు. వాటిలో 1999 - 2004 మధ్య కాలంలో 22 సంస్థలను మూసేశారు. 12 సంస్థలను పునర్వ్యవస్థీకరించారు. 11 సంస్థలను ప్రయివేటీకరించారు. 9 సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించారు. మొత్తం 54 సంస్థల తలరాతలు మార్చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి విలువను నిర్ణయించే పనిని ఏ మాత్రం అనుభవం లేని సంస్థలకు అప్పగించారు. ఎంతో విశ్వసనీయత గల క్రిసిల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను పక్కనపెట్టి.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఓ చిన్న ఫ్లాట్లో భార్యాభర్తలే యజమానులుగా నిర్వహిస్తున్న మెస్సర్స్ విగ్నేశ్వర టెక్నికల్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ వంటి అనామక సంస్థల సాయం తీసుకున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఆయా సంస్థల ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి మరీ.. మార్కెట్ విలువ రూ. 636 కోట్ల వరకూ ఉన్న రాష్ట్ర స్థాయి సంస్థలు, కో ఆపరేటివ్ సంస్థలను కేవలం రూ. 209 కోట్లకే అధికార పార్టీ నేతలు, వారి అనుచరులకు కట్టబెట్టిన ఉదంతాలు ఉన్నాయి. హనుమాన్, ఏఎస్‌ఎం కో-ఆపరేటివ్ షుగర్ మిల్స్‌ను 2002 డిసెంబర్ 31న డెల్టా పేపర్ మిల్స్‌కు కారుచౌకగా కట్టబెట్టారు. ప్రస్తుత టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ షుగర్స్‌కు పలైర్ షుగర్స్‌ను కట్టబెట్టారు. నిజాం షుగర్స్ ఆస్తుల్ని కూడా పప్పు బెల్లాలు అమ్మేసినట్లు అమ్మేశారు. మండవ ప్రభాకరరావుకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్ గ్రూప్‌కు ఒక షుగర్ మిల్లు, ఒక స్పిన్నింగ్ మిల్లు ధారాదత్తం చేశారు.

విద్యుత్ పీపీపీలతో దోచిపెట్టారు

‘‘రాష్ట్రంలో విద్యుత్ అవసరాల కోసం ప్రయివేటు రంగంలో ఎనిమిది విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం చంద్రబాబు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు).. అటు ప్రమోటర్లకు, ఇటు తనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే ప్రహసనంగా మారాయి. 1997లో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రెండేళ్లలో 8 ప్రాజెక్టులనూ నిర్మించాల్సి ఉంది. కానీ బాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రమోటర్లను మారుస్తూ, కాల పరిమితిని పెంచుతూ, వినియోగించే ఇంధనాన్ని మార్చుతూ, రాయితీలు ప్రకటిస్తూ.. సర్కారుకు తీవ్ర నష్టం కలిగించారు. ఒప్పందం జరిగినప్పుడు ఉన్న ప్రమోటర్లందరూ మారిపోయారు. ఒప్పందం జరిగిన ఐదేళ్ల తర్వాత కూడా ఒక్క ప్రాజెక్టూ నిర్మాణం కాలేదు. లేని గ్యాస్ ఆధారంగా తన అనుయాయులకు విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చేసి స్థిర చార్జీల పేరుతో ఖజానాను వారికి దోచిపెట్టారు. కోనసీమ ఓక్వెల్ కంపెనీ వ్యవహారానికి సంబంధించి బిగ్‌బాస్‌కు ముడుపులు ముట్టాయంటూ సదరు కంపెనీ రాసిన లేఖను అప్పట్లో అసెంబ్లీలో మైసూరారెడ్డి బయటపెట్టారు.’’

http://www.jagananna.com/2011/11/4000-30_18.html

No comments:

Post a Comment