Sunday, 18 December 2011

Chandrababu Naidu properties value 39 crores ! Really ?

హైదరాబాద్ నడిబొడ్డున, పంజగుట్టలో 650 గజాల స్థలంలో ఓ పెద్ద భవనం. దానిని చంద్రబాబు తన భార్య భువనేశ్వరి పేరిట చూపిస్తూ రూ.73.33 లక్షలను విలువగా పేర్కొన్నారు. మరోవైపు దానిపైనే విజయ బ్యాంకులో రూ.3.46 కోట్ల అప్పున్నట్టు చూపించారు. అంత తక్కువ విలువున్న భూమికి బ్యాంకు దాదాపు ఐదు రెట్లు అధికంగా అప్పెలా ఇచ్చింది? అంటే… బాబు తన ఆస్తి విలువను తక్కువగానైనా చెప్పి ఉండాలి. లేదా బ్యాంకునైనా మోసం చేసి ఉండాలి… నిజానికి 2009 ఎన్నికల సందర్భంగా ఇదే ఆస్తికి బాబు స్వయంగా కట్టిన విలువే రూ.5.69 కోట్లు.
నిజానికి ఇప్పుడు దాని అసలు మార్కెట్ విలువ ఎంతలేదన్నా రూ.10 కోట్ల పైమాటే!

మరో ఉదాహరణ: తమిళనాడులోని శ్రీపెరంబుదూరు మండలం చెన్నారుకుప్పంలో భువనేశ్వరి పేరిట ఉన్న 50 వేల చదరపు అడుగుల గోదాముల విలువను కేవలం రూ.1.86 కోట్లుగా చూపించారు. కానీ దానిపేరిట యూకో బ్యాంకులో తీసుకున్న అప్పునేమో రూ.5.39 కోట్లుగా పేర్కొన్నారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విలువేమో రూ.10.49 కోట్లు!


ఇంకో ఉదాహరణ: తొమ్మిదో నంబరు జాతీయ రహదారి పక్కనే, హైదరాబాద్‌లోని అత్యంత విలువైన మదీనగూడలో భువనేశ్వరి పేరిట ఉన్న అయిదెకరాల భూమి విలువ రూ.73.8 లక్షలని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. దీనిపై బ్యాంక్ ఆఫ్ బరోడాలో తీసుకున్న అప్పునేమో రూ.2.98 కోట్లుగా చూపించారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో తనే పేర్కొన్నది కేవలం రూ.9 కోట్లు. నిజానికి దాని ప్రస్తుత విలువ హీన పక్షం రూ.40-50 కోట్ల పైమాటే!


హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 65లో 1,125 గజాల్లో నిర్మించుకున్న ఇంటి విలువ రూ.23.3 లక్షలని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. కానీ ఇదే ఆస్తి విలువను ఆయన 2009 ఎన్నికల అఫిడవిట్లో రూ.8.89 కోట్లుగా చూపించారు. ఉద్దేశపూర్వకంగా తన ఆస్తుల అసలు విలువను అత్యంత తక్కువ స్థాయిలో చూపించి, అదే సమయంలో అప్పుల్ని భారీగా చూపిస్తూ.. అంతిమంగా తనకు పెద్దగా ఆస్తులేమీ చెప్పుకోవటానికి బాబు పడరాని పాట్లన్నీ పడినట్లు ఈ ఉదాహరణలన్నీ ఎలుగెత్తి మరీ చాటుతున్నాయి. ఇవే కాదు; ఆస్తుల ప్రకటనలో చంద్రబాబు ప్రదర్శించిన మాయాజాలాన్ని ఇంకా చాలా ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు కథ చెప్పలేదేం…?


1986 మార్చిలో చంద్రబాబు, సోదరుడు, తండ్రి ఉమ్మడి ఆస్తి 77.4 ఎకరాలని ఆ కుటుంబం వెల్లడించింది. ఐతే 1978కన్నా ముందు బాబు తండ్రి ఖర్జూరనాయుడు ఆస్తి కేవలం అరెకరం. తల్లి అమ్మణ్ణమ్మకు పసుపుకుంకుమగా
వచ్చిన ఆస్తి రెండున్నర ఎకరాలు. మరి అది ఎనిమిదేళ్లలో 77.4 ఎకరాలకు ఎలా పెరిగింది? విష్ణుప్రియ హోటల్ నిర్మాణానికి, భువనేశ్వరి కార్బయిడ్స్ స్థాపనకు కావాల్సిన పెట్టుబడి ఎలా వచ్చింది? 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికవడం, మంత్రివర్గంలో స్థానం లభించడం, అనంతరం ఎన్టీఆర్ కూతురిని వివాహమాడటం తప్ప బాబు చేసిన వేరే వ్యాపారాలేమీ లేవు. మరి అలాంటప్పుడు అంత ఆస్తి ఎలా సమకూరిందో చెప్పాలి కదా? తనకు వేరే ఎలాంటి వ్యాపార వ్యాపకాలు లేవని 1992-93 ప్రాంతంలో హెరిటేజ్ కోసం కంపెనీల రిజిస్ట్రార్‌కు, తన వార్షికాదాయం కేవలం రూ.36 వేలు మాత్రమేనని అంతకుముందు కర్షకపరిషత్ వివాదం వచ్చినప్పుడు కోర్టులో బాబు చెప్పిన తీరును పరిగణనలోకి తీసుకుంటే… 77 ఎకరాలను ఎలా సమకూర్చుకున్నారో ఆయనెందుకు చెప్పడం లేదు?


1992-93లోనే ఆ కుటుంబం హెరిటేజ్‌లో దాదాపు రూ.76 లక్షల్ని పెట్టుబడిగా ఎలా పెట్టగలిగింది? తాను కేవలం రూ.26 లక్షలే పెట్టుబడిగా పెట్టానని బాబు ఈ రోజు చెబుతున్నారు కానీ అప్పట్లో ఆయనకు స్థాపన భాగస్వాములుగా ఉన్నవారు మాత్రం దాన్ని రూ.76 లక్షలుగా చెబుతున్నారు. ఏది నిజమో, ఆ డబ్బెక్కడిదో చెప్పకుండా బాబు ఎందుకు దాచిపెడుతున్నారు?


అంత ఆస్తి ఆమెకెక్కడిది?


చంద్రబాబు కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు రెండు గేదెల పాడితో, రెండున్నరెకరాల భూమిపై వచ్చే అరకొర ఆదాయంతో ఆయన తల్లి అమ్మణ్ణమ్మ ఆ కుటుంబాన్ని చక్కదిద్దేవారు. ఆమె పేరిట తరువాత కూడా ఎలాంటి వ్యాపారాలు లేవు. మరి అలాంటప్పుడు హైదరాబాద్‌లోని మియాపూర్, కొండాపూర్ సమీపంలోని మదీనగూడలో ఆమె ఐదెకరాల స్థలాన్ని (సర్వే నంబర్ 51/ఏ) ఎలా కొనుగోలు చేయగలిగారు? మనవడు లోకేశ్‌కు ఆమె 2001లో కానుకగా ఇచ్చిన స్థలమది. ఐతే దానిపక్కనే ఉన్న (సర్వే నంబర్ 51) మరో ఐదెకరాల్ని భువనేశ్వరి కొనుగోలు చేసినట్టు బాబు ఆస్తుల ప్రకటన వెల్లడిస్తోంది. అదీ… కేవలం రూ.73 లక్షలకు మాత్రమే! దాని అసలు విలువను పక్కన పెడితే… అసలా భూమి ఎవరిది? తనకు వ్యవసాయమంటే చాలా ఇష్టమనీ, అందుకే అత్యంత విలువైన మాదాపూర్‌లో 3 ఎకరాల స్థలాన్ని వ్యవసాయం కోసం కొన్నాననీ బాబు చెప్పడం కేవలం జనం కళ్లకు గంతలు కట్టడం గాక మరేమిటి? అలాగే… దాన్ని అమ్మేసి వేరే చోట స్థలం కొనుగోలు చేశానని చెబుతున్న బాబు అలా కొన్న భూమి ఎక్కడుందో, దాని విలువెంతో ఆస్తుల ప్రకటనలో ఎందుకు వెల్లడించలేదో…? అమ్మణ్ణమ్మ 2000 సెప్టెంబర్లో జూబ్లీహిల్స్‌లో అతి విలువైన 1,135 చదరపు గజాల స్థలాన్ని ఏకంగా రూ.40 లక్షలకు కొనుగోలు చేశారు. 2001 డిసెంబర్లో దాన్ని లోకేశ్‌కు బహుమతిగా ఇచ్చేశారు. ఇంత డబ్బు ఆమెకెక్కడిది?


ప్రభుత్వ భూమినీ అమ్మేసుకున్నారా?


వ్యవసాయం మీద మక్కువతోనే నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో భూములు కొన్నానని చెబుతున్న బాబు తను సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్లొచ్చాననీ, తన భార్య భువనేశ్వరి చాలాసార్లు అక్కడికి వెళ్లేవారని వెల్లడించారు. తర్వాత ఆ భూమిని చౌకధరలకు బంధువులకు అమ్మేశాననీ చెప్పారు. బాబు వ్యవసాయ క్షేత్రంలో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులే ధ్రువీకరిస్తున్నారు. అంటే… సీఎం హోదాలో ఉన్నప్పుడు సైతం ప్రభుత్వ భూమిని కబ్జా చేశానని, తర్వాతి కాలంలో దాన్ని బంధుగణానికి కట్టబెట్టానని బాబే నేరాంగీకార ప్రకటన చేస్తున్నట్టేనా? దీన్నెలా సమర్థించుకోగలరు? ఇప్పటికీ అక్కడ 320 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌తో పకడ్బందీ రక్షణ ఏర్పాట్లు ఎందుకో? నిజంగా ఆ వ్యవసాయ క్షేత్రం అసలు యజమాని ఎవరో చెప్పాల్సింది బాబే కదా?


తను అడ్డగోలుగా పొందిన టాక్స్ డిఫర్‌మెంట్ వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం ‘తిరిగి చెల్లించే’ పద్ధతిలో తనకిచ్చిందని బాబు ఇప్పుడు బొంకుతున్నారు. కానీ నిజానికి బాబు తన హయాంలోనే, తనకు తానే ఆ వెసులుబాటు కల్పించుకుని బాగా లబ్ధి పొందిన వైనాన్ని గతంలోనే ‘సాక్షి’ వెల్లడించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ ట్రస్టు భవన్ పేరుకు తెలుగుదేశం ఆస్తిగా ఆ పార్టీ కార్యకర్తలకూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. నిజానికి ఈ ట్రస్టులో ఉన్నది ఆయన, ఆయన సతీమణి, ఆయన కుటుంబ ఆడిటర్ మాత్రమే. కాబట్టి దాన్ని కూడా ఆయన కుటుంబానికి సంబంధించిన ఒక స్థిరాస్తిలా ఎందుకు పరిగణించకూడదు? పైగా భవన నిర్మాణానికి నిధులిచ్చిన మోతుబరులెవరో, ఏ ప్రయోజనం పొంది ఆ భవనాన్ని నిర్మించి ఇచ్చారో కూడా బాబు చెప్పడం లేదు.


2004 నుంచి 2009 ఎన్నికల వరకు బాబు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆయన, ఆయన భార్య ఆస్తి కలిపి రూ.21 కోట్ల నుంచి రూ.41.19 కోట్లకు పెరిగినట్టు తేలుతుంది. తాజాగా ప్రకటించిన ఆస్తుల ప్రకారం వాటి విలువ రూ.28 కోట్లలోపే! హెరిటేజ్ సహా వచ్చి పడుతున్న ఆదాయమంతా ఏమైపోయింది? ఈ ఒక్క నిజం చాలు.. బాబు ఆస్తుల ప్రకటన ఎంత బోగస్సో చెప్పటానికి!


శుక్రవారం బాబు విలేకరులతో మాట్లాడుతూ… ‘నా ఆస్తి రూ.2 వేల కోట్లని రోజూ చెబుతున్నారు. అదిప్పుడు రూ.20 వేల కోట్లు అయి ఉంటుంది కాబట్టి, రూ.1,000 కోట్లిస్తే నా ఆస్తి రాసిస్తానని ఓ సామెతగా చెప్పాను…’ అని వివరణ ఇచ్చుకున్నారు. తద్వారా అన్యాపదేశంగానే దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తులపై మనసులో ఉన్న ఉజ్జాయింపు అంచ నా విలువను ఆయనే స్వయంగా వెల్లడించినట్లుంది!!

 http://chandrababu-naidu-scams.blogspot.com/2011/10/chandrababu-naidu-properties-value-39.html

No comments:

Post a Comment