టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సుజనాచౌదరిల మధ్య గల బంధం ఎలాంటిదో.. హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆ సంస్థ ఆస్తులను ఏ విధంగా కాజేశారో.. గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు అనుబంధ సంస్థగా హెరిటేజ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ అనే సబ్సిడరీ కంపెనీని సృష్టించారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో హెరిటేజ్ ఫుడ్స్‌కు ఉన్న విలువైన 3.42 ఎకరాల భూమిని కేవలం రూ.2.73 కోట్లకు హెరిటేజ్ ఇన్‌ఫ్రాకు బదలాయించారు. ఈ వ్యవహారం జరిగే రోజుల్లో అంటే 2005 ప్రాంతాల్లో కొండాపూర్‌లో ఎకరా భూమి విలువ రూ.12 కోట్లు పైమాటే. అయితే హెరిటేజ్ ఇన్‌ఫ్రాలో చంద్రబాబు భార్య భువనేశ్వరికి 49 శాతం వాటా ఉంది. అందుకే కారుచౌకగా హెరిటేజ్ భూమిని ఇన్‌ఫ్రాకు బదలాయించారు. ఇక సుజనాచౌదరికి చెందిన శ్రీచక్ర మర్కండైజింగ్ లిమిటెడ్ పెద్దగా కార్యకలాపాలు లేని సంస్థ. తమిళనాడులో రూ.600 అద్దె దుకాణమే దీని కార్యాలయం. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక రుణాల సంస్థ సికామ్ లిమిటెడ్ దగ్గర సుజనా రూ.60 కోట్లు అప్పు తీసుకుంది. దీనికి హామీగా హెరిటేజ్ ఇన్‌ఫ్రా తన దగ్గరున్న 3.47 ఎకారాలను హామీగా పెట్టింది. అంటే.. హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన భూమిని.. సుజనా సంస్థల కోసం.. చంద్రబాబు తన సతీమణి ద్వారా తాకట్టుపెట్టించారన్న మాట. భూమి విలువ కూడా హెరిటేజ్ ఇన్‌ఫ్రా ఖాతాల్లో ఉన్నంత వరకు రూ.2.73 కోట్లుగా పేర్కొని, రుణ సంస్థ సికామ్ లిమిటెడ్ వద్ద తాకట్టు పెట్టినపుడు భూమి విలువను రూ. 85 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం తర్వాతే సుజనాచౌదరికి చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇచ్చారు. అంటే.. ఆ 60 కోట్లు ఎక్కడికి చేరాయో.. సుజనాచౌదరికి రాజ్యసభ సభ్యత్వం ఏ సేవకు ప్రతిఫలమో అర్థం చేసుకోవచ్చు! http://sakshi.com/main/Fullstory.aspx?catid=286241&Categoryid=1&subcatid=33 |
No comments:
Post a Comment